సంతోషం అంటే మనకి నచ్చింది చేయడం!!!
వేరొకరికి నచ్చినట్లంటే మనసు చంపుకోవడం
ఇంకొకరి సంతోషాన్నిచూసి మనం తృప్తి పడ్డం
చేతకానితనంతో ఏం చేయలేక సర్దుకుపోవడం
ఇది కప్పిపుచ్చి మాట్లాడ్డమే సూక్తులు చెప్పడం
జవాబీయలేని ప్రశ్నలని వితండ వాదన అనడం
మరీ విసిగిస్తే మొండితనమని మాట్లాడకపోవడం
అనుకున్నవి ఎంత ప్రయత్నించినా జరగకపోతే....
అన్నింటికీ సర్దుకుని సాగిపొమ్మని సలహా ఇవ్వడం
ఎంతవరకు సమంజసం? ఒకవేళ ఇదే నిజమైతే....
సరైనదైతే ఎందుకు సాధించేవరకు పోరాడమనడం?
సగటు మానవునికి సర్దుకుపోవడం తప్పదు కదా ప్రేరణ గారూ..
ReplyDeleteఅందరూ సగటు మానుషులుగా సర్దుకుపోతే ఇంక ఏం సాధిస్తాం :-(
Deleteఅందుకేనేమో స్కూళ్ళలో కూడా సూక్తులు చెప్పడం మానేసి, చదివి పట్టాపుచ్చుకుని పారిపొమ్మని చెబుతున్నారు నేడు :-)
ReplyDeleteసరదాగా మాడం.....నిజానికి సర్దుకుపొమ్మని చెప్పడం చాలా సులభం, కాని అనుకున్న ఆశయం తీరక జీవఛ్ఛవంలా బ్రతకడం దుర్లభం. ఆవేదనతో కూడుకున్న ఆలోచనాత్మక పోస్ట్.
నా ఆవేదన మిమ్మల్ని ఆలోచింప చేసినందుకు అర్థం చేసుకున్నందుకు ఆనందం.
Deleteఇష్టమైన వారికోసం ఎంత సర్దుకుపోయినా కష్టమనిపించదు. కానీ మనసు మూలల్లో ఏ మాత్రం అయిష్టత ఉన్నా అది అసాధ్యం.
ReplyDeleteఅభిమానం దరిచెరకునడా ఒక్కరి కోసమే ఏదైనా చేయగలం....కానీ ఇతరత్రా...నేను అంగీకరించను...పోరాడాలి....గెలిచే తీరుతాము.
మీరన్నది నిజమే ఇష్టమైనా వారి కోసం సర్దుకుపోవడంలో ఇష్టముంటుంది అనేదానికి కూడా ఒక హద్దు ఉంటుందేమోనండి. మొత్తనికి పోరాడాలి సాధించేవరకు అన్నది నచ్చిందండి. థ్యాంక్యూ.
Deleteసర్దుకుపోవటం అనేది ఒక మనస్తత్వం.
ReplyDeleteఅంతేగానీ బలవంతంగా అది ఆచరించినా
ఎప్పుడో ఒకప్పుడు అసలు రూపం బైట పడి ఎదురుతిరగటం తద్యం.మొత్తమ్మీద మీ పొస్ట్ మమ్మల్ని సర్దుకుపోనీయటం లేదు తల్లీ... మీ చేత ఇంకా ఇలాంటివి రాయించాలని అనిపిస్తుంది. బాగుంది ఆలోచించేలా...అభినందనలు.
అభిమానంగా అభినందించి వ్రాసేలా ప్రేరేపిస్తున్న మీకు నమస్కారం.
Deleteనేను ఒప్పుకోను...మనమనుకున్నది సాధించాలి అన్న పట్టుదల లేకపోతే జీవితం నిస్తేజం
ReplyDeleteఇన్ని ఆలోచనాత్మక ప్రశ్నలతో సతమతమవ్వాలా?
ReplyDelete