Wednesday, October 23, 2013

!!అవిటి ఆకలి!!

అమాయకమైన ముఖం
ఆర్తిగా చూస్తున్న చూపులు
కడుపులో రగులుతున్న ఆకలి
ఎండకు మాడతానన్న భయంలేదు
చలివణుకుడును సైతం లెక్కచేయడు
చిరిగిన దుస్తులు, చీమిడికార్చే ముక్కు
మోకాలికైన గాయం నుండి స్రవిస్తున్న రక్తం
అయినా వాడిలో లెక్కచేయని మొండి నిర్లక్ష్యం
ఆకలిని ఎదిరించి పారిపోవాలి అన్నదే వాడి లక్ష్యం
అంతలో....ఆకర్షిందా పిల్లవాడ్ని ఆకలిగొన్న అవిటితనం
ఎదురుగా మరో పిల్లవాడు రొట్టెముక్కలు కూర్చుని తినడం!!

4 comments:

  1. అవితనం ఆకలిది నాది కాదు అని చక్కగా చెప్పారు.

    ReplyDelete
  2. Great!
    Aakalini teerchevaariki....teerchukunevaariki kalige santrupti goppadi.
    Ur kind hearted to be able to write this. Hope u help many....

    ReplyDelete
  3. ఆర్థత నిండిన ప్రతి పదం చిత్రమూ వేదనని నింపాయి ప్రేరణ గారు..

    ReplyDelete
  4. ఆకలిపై కవిత బాగుంది

    ReplyDelete