Saturday, October 19, 2013

!!ఇలా ఎలా?!!


పరిమళాలన్ని కూర్చి అత్తర్లుగ అందించేసాక..
ఇప్పుడు వాసనలేని కాగితపు పువ్వంటే ఎలా?

కన్నకలలు కానేరవంటూ కనులు వెలివేసాక..
వేరొకరి కలలు తీర్చే మార్గం చూపమంటే ఎలా?

పోషించిన ప్రేమపాశాన్ని పోల్చి పరిహసించాక..
పశ్చాతాప పడక పాషాణంగా మారమంటే ఎలా?

నమ్మకపు వంతెనే నాణ్యత లేక కూలిపోయాక..
ఆశచంపి జీవంలేని కోరికలు కోరుకోమంటే ఎలా?

వెలుగుని పంచి చమురులేని దీపమై మిగిలాక..
మిణుకువలె మెరిసే దీపాన్ని వెలగమంటే ఎలా?

ఉదరము నుండి ఊపిరిని వేరవమని శాసించాక..
గడిచిన కాలాన్ని తిరిగి రమ్మని జీవించడం ఎలా?

10 comments:

  1. ఉదరము నుండి ఊపిరిని వేరవమని శాసించాక..
    గడిచిన కాలాన్ని తిరిగి రమ్మని జీవించడం ఎలా?

    బదులు తిరిగి చెప్పలేని ప్రశ్నలు అడిగారు.ఇంతలా బాధ పెట్టినా ఓర్పుగా ఆ నిస్వార్ధ బంధానికి నిర్వచనం తెలిసేలా చేయాలి....

    ReplyDelete
  2. పదాల కూరిక లో పొందిక ను చూస్తున్నాను.

    "పరిమళాలన్నీ ఆస్వాదించేసి ఇప్పుడు వాసనలేని కాగితపు పువ్వంటున్నావు. చమురంతా వెలుగై ఆవిరయ్యాక దీపమై వెలగమంటున్నావు. ఉదరము నుండి ఊపిరిని వేరవమని శాసిస్తూనే గడిచిన కాలాన్ని తిరిగిమ్మంటున్నావు."

    కవిత చాలా బాగుంది ప్రేరణ గారు. శుభోదయం!

    ReplyDelete
  3. నమ్మకపు వంతెనే నాణ్యత లేక కూలిపోయాక..
    ఆశచంపి జీవంలేని కోరికలు కోరుకోమంటే ఎలా?
    ఈ పాదం నాకెందుకో కన్నీళ్ళను తెప్పించాయి. కవిత ఆసాంతం బిగువుగా సాగి మనసును ఆర్థ్రతతో నింపింది ప్రేరణ గారు.

    ReplyDelete
  4. అయ్యో ఆలస్యంగా తెలుసుకుంటే ఎలా???
    అంత అమాయకమైతే బ్రతికేది ఎలా...
    సున్నిత హృదయాన్ని అంతే సుకుమారంగా ఆవిష్కరించారు. అభినందనలు.

    ReplyDelete
  5. ఉదరము నుండి ఊపిరిని వేరవమని శాసించాక..
    గడిచిన కాలాన్ని తిరిగి రమ్మని జీవించడం ఎలా?
    మనసు కలచివేసే వాక్యాలు....:-(

    ReplyDelete
  6. మీ కవితల్లో సంపూర్ణ పరిపక్వత.

    ReplyDelete
  7. అందరికీ ధన్యవాదాలు _/\_

    ReplyDelete
  8. చాలా వ్యథగా వ్రా

    ReplyDelete