వస్తావన్న ఆశతో పర్ణశాలలో పచ్చిక పరిచా
నిరీక్షణా క్షణాలెన్నో బరువెక్కాయి నీవురాక
గతస్మృతులే నవ్వుగా చెక్కిళ్ళపై శింగారించా
వేదనపుఛాయ చారికలు నీకు కనబడనీయక
ఆశపడ్డ మనసునే మఖ్మల్ దుప్పటిగా వేసా
రెక్కలు కట్టుకుని వస్తావని కలని కరగనీయక
ఆలస్యంతో నమ్మకాన్నే విరిచేసావు వృధాగా
అల్లుకున్నబంధం ఎదురుచూసింది ఆశచావక
ప్రేమపాశమేదో ఊగుతుందింకా నట్టేట్లో నావలా
నాజూకు గాలమేస్తే ఒడ్డుచేరునా నావ మునగక
ఎదురుచూపులన్నీ దాడిచేసాయి శత్రుసైన్యంగా
అద్దమే భయపడింది ఏడ్చిన మోము చూడలేక
మరణం ఎంతో చేరువౌతుంది కాలంతో పాటుగా
చావంటే భయంకాదు నీవు ఉండలేవు నేనులేక
నిరీక్షణా క్షణాలెన్నో బరువెక్కాయి నీవురాక
గతస్మృతులే నవ్వుగా చెక్కిళ్ళపై శింగారించా
వేదనపుఛాయ చారికలు నీకు కనబడనీయక
ఆశపడ్డ మనసునే మఖ్మల్ దుప్పటిగా వేసా
రెక్కలు కట్టుకుని వస్తావని కలని కరగనీయక
ఆలస్యంతో నమ్మకాన్నే విరిచేసావు వృధాగా
అల్లుకున్నబంధం ఎదురుచూసింది ఆశచావక
ప్రేమపాశమేదో ఊగుతుందింకా నట్టేట్లో నావలా
నాజూకు గాలమేస్తే ఒడ్డుచేరునా నావ మునగక
ఎదురుచూపులన్నీ దాడిచేసాయి శత్రుసైన్యంగా
అద్దమే భయపడింది ఏడ్చిన మోము చూడలేక
మరణం ఎంతో చేరువౌతుంది కాలంతో పాటుగా
చావంటే భయంకాదు నీవు ఉండలేవు నేనులేక
చావంటే భయంకాదు నీవు ఉండలేవు నేను లేక.....nijame kadaa....nenoo Ade anukuntoontaa....nenu preminche manasu nenu lekundaa undagaladaa asalu anee....we cannot miss them a sec also...u must have patience....
ReplyDeleteEvery word is reflecting da soul of a HUMAN......very nice
హృదయాన్ని ద్రవింపజేసే అక్షరమాల ప్రేరణ గారూ..
ReplyDeleteవస్తావన్న ఆశతో పర్ణశాలలో పచ్చిక పరిచా
ReplyDeleteనిరీక్షణా క్షణాలెన్నో బరువెక్కాయి నీవురాక
naaku chaala baaga nachindi😊
చాలా బాగుంది ప్రేరణగారు
ReplyDeleteఇలా హృదయాన్ని తాకేలా ఎలా రాస్తారు.
ReplyDelete