Tuesday, October 15, 2013

!!ఏదో ఆశ!!

మూసిన తలుపు తెరుచుకుని మార్గమేదో కనపడింది
ఆలోచనలు తెగి బంధం జైలు నుండి విడుదలయ్యింది

నిరాశ నుండి భావోధ్వేగాల ఆశాకిరణం  ఉదయించింది
చీకట్లో నా శరీరం నుండి నా నీడే వేరై విడివడి పోయింది

ఆనందం నవ్వుతూ కష్టాల్లో తనని కౌగిలించుకోమంది
ఆత్మస్థైర్యమే నన్ను వీడక నాకు తెలియని బంధమైంది

గతించిన దానికి ఫలితమంటూ మది దాహార్తిని కోరింది
కంటికి ఎదురుగా మరో కోణమేదో నీటిపాయగా పారింది

దుమ్ము పొరలను దులిపి తుడిచిన అద్దం నిగారించింది
సమయమే పరిమళం అందించి గమ్యం చూపబోతుంది!

9 comments:

  1. Excellent! Be positive always...

    ReplyDelete
  2. ప్రతి లైన్ లోను మీ ఆశావాదం కొనియాడ తగ్గది...బాగుందండి

    ReplyDelete
  3. దుమ్ము పొరలను దులిపి తుడిచిన అద్దం నిగారించింది
    సమయమే పరిమళం అందించి గమ్యం చూపబోతుంది!
    Positive thoughts poem.

    ReplyDelete
  4. వ్యధాభరితమైన ప్రేరణాత్మక కవిత, చాలా నచ్చింది.

    ReplyDelete
  5. మూసిన తలుపు తెరుచుకుని, నిరాశ నుండి ఒక భావోధ్వేగ ఆశాకిరణం .... నా శరీరం నుండి నా నీడ వేరై .... ఆనందం, ఆత్మస్థైర్యం ఒక బంధమైంది.
    !!ఏదో ఆశ!! కవిత ద్వారా బ్రహ్మ రహశ్యాన్ని ఆవిష్కరించిన తీరు చాలా బాగుంది. అభినందనలు ప్రేరణ గారు!

    ReplyDelete
  6. దుమ్ము పొరలను దులిపి తుడిచిన అద్దం నిగారించింది
    సమయమే పరిమళం అందించి గమ్యం చూపబోతుంది!...కవిత చాలా నచ్చింది...

    ReplyDelete
  7. _/\_స్పందనలకు వందనములు.

    ReplyDelete