Sunday, January 5, 2014

అమ్మను...

గోరుముద్దలుకొన్ని గోముగా తినిపించి

ముద్దులు ఎన్నో మూటల్లో పంచి పెంచి

ఆత్మవిశ్వాసం ఆభరణంగా అలంకరించి

చిరునవ్వనే ఆయుధాన్ని నీకు అందించి

నా ఆశలన్నీ నీ కళ్ళలో కలలుగా గాంచి

నాకు సాధ్యంకాని విజయం నీలో నే చూసి

ఆనందించే వేళలో నా ఆయువు నీకు పోసి

నీలో ఊపిరిగా ఉంటాను- అమ్మనుగా నేను!

11 comments:

  1. అమ్మ ఓ అద్భుతమైన భావన . అమ్మను మించిన దైవం ఏముందీ ....రాణీగారు అమ్మ ఆశలు చాలా బాగున్నాయి.

    ReplyDelete
  2. అమ్మ అనే పదానికి ఊపిరి పోస్తుంది మీ కవిత.

    ReplyDelete
  3. అమ్మ ప్రేమను గోరుముద్దలా రుచి చూపారు ప్రేరణ గారు..

    ReplyDelete
  4. చిక్కనైన భావకవిత

    ReplyDelete
  5. గోరుముద్దలు కొన్ని గోముగా తినిపించి
    ఆత్మవిశ్వాసం ఆభరణం, చిరునవ్వు ఆయుధం గా
    నా ఆయువు నీ ఊపిరిగా ఉంటాను నీడలా - అమ్మను నేను!

    అమృత మూర్తి అమ్మ ను వస్తువు గా రాసుకున్న ఒక చక్కని భావన శిల్పం
    అభినందనలు ప్రేరణ గారు!

    ReplyDelete
  6. సరిరాదు ఏదీ అమ్మమనసుకు

    ReplyDelete
  7. అమ్మ ప్రేమను ఎంత బాగా చెప్పారు పద్మ గారు.
    "ఆత్మవిశ్వాసం ఆభరణంగా అలంకరించి"
    ఇంతకంటే ఇంకేం కావాలి . గుండెకు హత్తుకునేలా ఉంది మీ కవిత

    ReplyDelete
  8. అమ్మ ఆప్యాయత రంగరించిన కవిత

    ReplyDelete
  9. గోరుముద్దలా గోముగా ఉన్నాయి మీ అమ్మ మనసులోని మాటలు

    ReplyDelete
  10. బ్లాగ్ లో అందరివీ అలరించే భావాలే నేను ఏం రాయగలను

    ReplyDelete
  11. Amma thinipinche gorumuddalaa madhuramgaa undi mee kavita prerana gaaru:-):-)

    ReplyDelete