Tuesday, December 31, 2019

2020కు స్వాగతం

ఎంత చిత్రమైనదో డిసెంబర్ & జనవరి మధ్య సంబంధం!?
పాతజ్ఞాపకాలతో ఒకటివెళితే కొత్త వాగ్దానాలతో ఒకటొస్తుంది

దేనికదే చాలా సున్నితమైనది మరియు లోతైనవి కూడా
రెండూ సమయానుసారం పయనిస్తూ ఎదురీదుతుంటాయి!

రెంటివీ అదే రంగూ రూపం అవే తేదీలూ అంకెలు కూడా
కానీ గుర్తింపు మాత్రం భిన్నం ఆలోచనలు వేరుగుంటాయి!

ఒకటి ముగింపు మరొకటి ఆరంభం అవే రేయిపగలు కూడా
అనుభవం ఒకదానిదైతే ఆశ నమ్మకం మరోదానిది అంటాయి!

రెండూ కలిసుంటాయి దారానికి చెరో చివరన ఉంటూ కూడా
డిసెంబర్ వదిలివేసి వెళ్ళినవి జనవరిలో కడతేరుతుంటాయి!

జనవరి నుంచి డిసెంబరుకు ప్రయాణం 11 నెలలైనా కూడా
డిసెంబర్ మాత్రం వచ్చి జనవరినీ క్షణాల్లో కలుసుకుంటాయి!

ఇరువురు దూరమైనప్పుడు పరిస్థితులు మారిపోయినా కూడా
ఇవి రెండూ కలిసిన సమయాన్న సంవత్సరాలు మారతాయి!

మిగతా నెలల మధ్య బంధమేస్తారు వీరు కలిసి దూరమై కూడా
కలిసి విడిపోయిన ప్రతీసారీ లోకాని పండుగలా మిగిలిపోతాయి!

క్రొత్తకు ఎప్పుడూ స్వాగతం పలుకుతూ పాతదానికో వందనం..
ఆంగ్ల నూతన సంవత్సరము శుభాకాంక్షలు- వెల్కం టు 2020

Monday, December 30, 2019

Blooming at Book Fair


లక్షల పుస్తకాలు...ఎన్నని చూడగలను!!!! 
ఏ పుస్తకమని చదవగలను...అదో ఇదో తెలియక
అటూ ఇటూ చూసి అన్నీ కొనలేక కొన్ని కొన్నాను.

Tuesday, December 10, 2019

Tuesday, December 3, 2019

!!వెల్ కం!!

మునపటిలా చెట్లు ఎక్కాలనుకుని పళ్ళు ఇకిలించినంత మాత్రాన్న
వయసు సహకరించదు కదా...వృధ్ధాప్యానికి వెల్ కం చెప్పేస్తున్నా!

Monday, November 25, 2019

!!గట్టి గుండె!!

అనుభవసారానుసారంగా నన్ను నేను అచ్చువేసుకుంటున్నాను 
ఎవరైనా ప్రేమించాననంటే వెంటనే భుజాలు తడుముకుంటున్నాను 

ఒక చెంపపై కొట్టారంటే రెండవ చెంప చూపించడం పుస్తక జ్ఞానం
ఎవరైనా పక్కలో బళ్ళెమైతే వెంటనే కత్తిదూయడం నేటి పరిజ్ఞానం 

అప్పట్లో పాము నీడలో ఉన్నట్లు ఊహించుకుని మరీ భయపడ్డాను 
ఇప్పుడు విషానికి విరుగుడు వెతుక్కుని విలాసంగా బ్రతికేస్తున్నాను 

ఒకరు నన్ను కుట్రబూని వంచిస్తే మోసబోవడం అప్పటి నా అజ్ఞానం
ఎదుటివారి చిరునవ్వులోని చిద్విలాసాన్ని చదువ గలదు నా జ్ఞానం

అనవసరంగా అన్నింటా తలదూర్చి అప్పుడు చేతులు కాల్చుకున్నాను
ఎవరేది చెప్పినా సొంతగా ఆలోచించి వాయిదా వేసి తప్పుకుంటున్నాను

ఒంటర్ని నేనంటూ వణకిపోతూ జాగ్రత్తగా ఉండేది గాజులాంటి హృదయం
ఎప్పుడైతే రాయిగా మారిపోయెనో మది ఎగిరిగెంతులు వేస్తుంది జీవితం!

Sunday, November 24, 2019

My Srilanka Saga

లింక్ పై నొక్కి శ్రీలంక చిత్రాలు చూసేయండీ

Friday, October 25, 2019

!!జీవితం చాలా చిన్నది!!



!!బ్రతకాలన్న కోరిక పెద్దది!!

Friday, October 11, 2019

Tuesday, September 17, 2019

!!నాకు నేను!!

నేడు అనుకోకుండా చాన్నాళ్ళకు 
నన్నునేను అద్దంలో చూసుకున్నాను..
నన్నునేను గుర్తించే ప్రయత్నం చేసాను!

అదే అందమైన నిలువుటద్దం అక్కడే ఉంది 
అదే ముఖం అలా నన్ను చూసి ఆలోచిస్తుంటే
అన్నీ ఎక్కడివి అక్కడే ఉన్నట్లున్నాయి.. 
జీవిత వెతుకులాటలో నన్నునేను కోల్పోయాను!

కాలం కరిగిపోతుంటే సంబంధాలని పెనవేస్తూ
నాకు నేను దూరం అయిపోయానని..
అనుకుంటూనే వెనక్కుతిరిగి చూసుకున్నాను!

అదే అలా వెనక్కి బాగా వెనక్కు వెళ్ళి చూస్తే
ఒంటరిగా ఏకాకినై నన్ను నేను ప్రశ్నించుకున్నా 
పత్నిగా, కోడలిగా, తల్లిగా, అమ్మమ్మగా..
అనుకునో అనుకోకనో అన్ని పాత్రలూ పోషించాను
ఈ పాత్రల్లో ఎక్కడా నా అనుకునే "నేను" లేను!

నేడు నాకునేను బాసచేసుకుని నాకునేనే నా అని  
నా ఉనికిని నే ప్రేమించి స్వాభిమానంతో రమించి..  
స్వశక్తితో నేను నాకోసం బ్రతకాలి అనుకుంటున్నాను!

Monday, September 9, 2019

Padmarani-The Unique

అందరిలా కాకుండా ప్రత్యేకంగా ఉండాలి.. ఎలా?

Sunday, August 11, 2019

!!వాక్ వాక్!!

వాక్ వాక్...నడక ఉత్తమ వ్యాయామం
వాదోపవాదాలు కోపోధ్రేకానికి దారి తీస్తాయి
అందుకే వాట్ని కాలితో తన్ని నడచివెళ్ళిపో!

ఉద్దేశపూర్వకంగా అణచివేసే వ్యక్తులుంటారు
వారిని త్రోసి నీదారిలో నువ్వు నడచివెళ్ళిపో!

ఆత్మస్థైర్యాన్ని తగ్గించే ఆలోచనలే ఆటంకాలు
వాటి మొదళ్ళు త్రుంచి వేగంగా నడచివెళ్ళిపో!

నిన్ను లెక్కచేయని అవకాశవాదులు ఎందరో 
కన్నెత్తైనా చూడక నీ గమ్యంవైపు నడచివెళ్ళిపో!  

వైఫల్యాల్ని గుర్తుచేసి ఆందోళన రేపేవే భయాలు
అడ్డంగా నరికేసి అనుభవపాఠంతో నడచివెళ్ళిపో!
   
జీవితం ఆనందంగా ఆరోగ్యంతో గెంతులువేసేను 
విషంలా ప్రాకే విషయాలను నలిపి నడచివెళ్ళిపో!

వాక్ వాక్...నడక ఎంతో ఉత్తమ వ్యాయామం 
ప్రేమ దయ శాంతి మరియు మంచితనం వైపు
ఆలోచించక వేగంగా అడుగులువేసి నీవు సాగిపో! 

Thursday, July 11, 2019

నా జీవిత అల


నా జీవిత సాగరపు అలలు
కొన్ని మిమ్ము తాకాలని చేసిన
చిన్ని వీడియో ప్రయత్నం...

Thursday, July 4, 2019

!!మరోమారు జీవిస్తాను!!

పదవీ విరమణ తరువాత జ్ఞాపకాల్లో బ్రతుకుతూ కాలాన్ని మళ్ళీ తిరగేస్తూ కొన్ని అనుభూతులని ఒకటికి రెండుసార్లు తలుచుకోవాలి అనుకుంటాను పసిపిల్లలా మారి పరుగులు తీయాలనుకుంటాను నాగరిక నడకలో నన్నునేను పరిగెత్తించాలని కాదు నా పరుగు చూసి అమ్మ నవ్వి మురిసిపోవాలని! పాఠశాలకు యూనిఫారంలో మరోమారు వెళతాను చదువులన్నీ చదివి ఏదో వెలగబెట్టేయాలని కాదు స్కూల్ ఫ్రెండ్సుని పలుకరించి అల్లరి చేసెయ్యాలని! కొత్తగా జాబ్లో చేరి కొలీగ్స్ ని కలవాలనుకుంటాను పని తక్కువ కబుర్లెక్కువా చెప్పుకోవచ్చని కాదు మొదటి నెల జీతం తీసుకున్న ఆనందంపొందాలని! మరోసారి పెళ్ళిచేసుకుంటే బాగుంటుందనుకుంటాను కంగారు పడకండి భాగస్వామిని మార్చాలని కాదు పెళ్ళి సంబరాలు మరింత ఘనంగా చేసుకోవాలని! పెళ్ళైన నా పాప మళ్ళీ పసిపిల్లైపోవాలనుకుంటాను తొందరగా ఎదిగి పెళ్ళితో దూరమైపోయిందని కాదు మరింత సమయాన్ని పిల్లల కోసం కేటాయించాలని! బ్రతకడానికి మరికొంత సమయం కావాలనుకుంటాను జీవితంలో సంపాధించి ఇంకేదో ఉద్దరించేద్దామని కాదు ఇతరులకు నేనేదో విధంగా కొంతైనా సహాయపడాలని! ఎన్ననుకుని ఏం లాభం..? గడిచిన కాలం తిరిగిరాదు అందుకే ఈ క్షణం మనదనుకుని సంపూర్ణంగా జీవిద్దాం!

Sunday, June 30, 2019

రాలే పువ్వుదీ రాగం


రాలే పువ్వుదీ రాగం
అర్థం చేసుకునే వారికోసం
నాలుగు వాక్యాలు చదివి..
రెండు నిముషాలు కేటాయించి
పాట కూడా వినండి నాకోసం!! 

Tuesday, June 25, 2019

!!మనవారు!!

మన అనుకున్నవారు మనల్ని మోసగించినప్పుడు
శత్రువులే మెల్లగా మిత్రులైపోతారు నేస్తం..
మిత్రులంటే కష్టకాలంలో మనతో ఉండాలి
సంతోష సమయంలో మనవాళ్ళు ఏమిటి!? 
కొజ్జాలు కూడా ఇంటి ముందుకు వచ్చి నర్తిస్తారు
ఒకప్పుడు మనిషి చస్తే ఆత్మలు తిరుగుతుండేవి
ఇప్పుడు ఆత్మల్ని చంపుకుని మనుషులు బ్రతికేస్తున్నారు   

Tuesday, June 18, 2019

ఈ జీవితం

ఓ ప్రియమైన అప్పటి నా మనోధైర్యమా 
నువ్వూ నీతోపాటుగా ఆ గుండెనిబ్బరం
దేన్నైనా కష్టపడి సాధించగలననే ధీమా
మీరు మరోసారి నాలోకి చొరపడండి   
వేలకోరికల నిఘంటువు…నా ఈ జీవితం
ప్రతీకోరికా తీరాలని చేసా విశ్వప్రయత్నం
ఆశయం అవమానంతో ముడిపడలేక తెగి
చావుకీ బ్రతుక్కూ తేడా తెలియక జీవిస్తూ
జరిగింది మరచి జరిగేదంతా మంచని తలచి
నవ్వుతూ నవ్విస్తూ బ్రతికేయాలనుకుంటున్నా!

Wednesday, June 5, 2019

!!తరాంతరం!!

మనుషుల్ని వంచిన విచిత్ర విజ్ఞానమా నీకు వందనం..
ఇంతకీ అజ్ఞానం ఆ తరానిదో ఈ తరానిదో తెలుపుమా!!

బావిలో నీరు త్రాగి హాయిగా బలాదూర్ గా బ్రతికేవాళ్ళని
ఫిల్టర్ నీరు త్రాగి 50ఏళ్ళకు వృద్ధులయ్యేలా వరమిచ్చావు

గానుగాడించి నూనె త్రాగి తిన్నవారిని నిగనిగలాడేలా చేసి
ఫిల్టర్ రిఫైండ్ ఆయిల్ తో 40ఏళ్ళకే గుండెను నొప్పించావు

రాళ్ళఉప్పును సేవించి కూడా రాయిలా గట్టిగా బ్రతికేవాళ్ళం
అయోడిన్ ఉప్పుతిని హై బీ.పి అని హైరానా పడుతున్నాం

ఆరేడు మందిని కని ఆరోగ్యంగా అన్ని పనులూ చేసే వాళ్ళు
ఒక్కర్ని కనడానికే ఆపసోపాలు పడి ఆపరేషన్ అంటున్నారు

బెల్లంతో పిండి వంటల్ని పీకలదాకా మెక్కి ఆనందించే మాకు
ఏమీ తినకముందే షుగర్ అని చెప్పి కడుపుకాల్చేస్తున్నారు

నాడిపట్టి రోగం చెప్పి రెండు మాత్రలిచ్చిన నాటి ప్రాణదాతలైన
వైద్యులు స్కానింగ్లు టెస్ట్లని కూడా రోగమేంటో చెప్పలేకున్నారు!

Saturday, June 1, 2019

!!అన్వేషణ!!

నన్ను నేను హత్య చేసుకోవాలనుకున్న ప్రతీసారి
బంధాల అడ్డంకులు నన్ను అడ్డుకుంటూనే ఉన్నాయి
అందుకే చడీచప్పుడు చేయక నిష్క్రమించాలనుకుని
నాపై నేనే ప్రతీకార పగను పెంచుకునే మార్గాన్వేషణలో
మరిన్ని క్రొత్తభాధ్యతలు నన్ను చుట్టుముడుతున్నాయి   
సరేలెమ్మని సర్దుకుని ఏరోజుకారోజు పొడిగించుకుంటూ
మనసుని సర్దుబాటు చేస్తూనే రోజులు దొర్లుతున్నాయి
మారుతున్న ఋతువులు ఏవో కూడా తెలియకుండానే  
ఉన్న దేహం ఒక్కటైనా పరిపరివిధాలా మార్పుచెందగా
పంతంపట్టిన మదిపొరలు కుదుటపడలేక చిట్లుతున్నాయి 
కొన్ని మోహాల్లో దాహాల్లో నాకై నేనే చిక్కుకున్నానంటూ 
నన్ను నేనే తిట్టుకుని అలాగని సమాధానపడనూ లేక 
చెదరిన గడ్డిపరకల గూటినే మరలా అల్లుకునే పిట్టలా
తప్పనిసరై నాలో నేనే మమకారం వెతుక్కుంటున్నా!!

Sunday, May 19, 2019

Friday, May 10, 2019

!!విచిత్రరోగం!!

అన్నింటినీ ఎదిరించి ఆసరాగా నిలబడి 
నేనున్నాను నీకని ధైర్యాన్ని ఇచ్చేవారే 
అసలైన ఆత్మీయులని ఎప్పటికప్పుడు
అనుకుంటూ నమ్మేస్తుంటాను అందరినీ!

ఏ బంధంలేని అనామకుల్ని నా అనుకుని 
నిస్వార్థ అభిమానంతో అక్కున చేర్చుకుని  
నాకు తోచిన/మించిన సహాయమే చేస్తాను
తెలిసి తప్పుచేసి దూరమౌతాను అందరికీ!

అనుకూలమై అవకాశం కుదిరితే ముడిపడి
అవసరానికి పలికితే తెలుసుకోలేని నా ఈ స్థితి
మనసున్న వారికొచ్చే రోగమని తెలిసి కూడా
నయంకాని చివరిదశ కామోసు రోగం పరిస్థితి
రోగం ఏదైనా రాకుండా చూసుకోవాలని చెప్పి
మానసికరోగానికి నవ్వడమే మందు అందరికీ! 

Saturday, May 4, 2019

!!ముఖం మారింది!!

అద్దంలో చూసుకుంటే నా ముఖమే మారింది
చూస్తూ చూస్తుండగానే ఎన్నో మారిపోయాయి
నా ఆశల మేఘం కురవకుండా నేలనితాకింది
అద్దంపై కాస్త ఎండపడగానే రూపం మార్చింది
అందుకే నేనద్దం చూడగా నా ముఖం మారింది!   

గందరగోళ ప్రశ్నల మధ్య జీవితానందం నలిగింది
దీపం ఆరిపోతుంది అనగా వెలుగు ప్రకాశించింది
కంటికి రాకరాక కునుకువస్తే కలే మారిపోయింది
చూస్తూ చూస్తుండగానే ఎన్నెన్నో జరిగిపోయాయి
అందుకే నేనద్దం చూసుకుంటే ముఖం మారింది!

కలల్ని ఖైదుచేసినా అన్నింటా ఓటమే మిగిలింది
సమయం మారువేషంలో వచ్చి నన్నే మార్చింది
గమ్యం దగ్గరౌతుంటే దారి మొత్తం మారిపోయింది  
నిన్నటి గుర్తులూ నేటి ఛాయలూ ఏం మిగల్లేదు
అందుకే నేను అనుకున్న నా రూపమే మారింది!

Saturday, March 23, 2019

క్షయవ్యాధి నివారణ దినోత్సవం

 "క్షయ" అంటే నశింపజేసేది..ఆరోగ్యాన్ని నశింపజేసే రోగమాయ
ట్యూబర్ క్యులోసిస్ అనే సూక్ష్మక్రిమి వలన వచ్చే వ్యాధి క్షయ..
ఊపిరితిత్తుల సంబంధించినదైనా ఏభాగాన్నైనా తాకును దీని ఛాయ!
     
ఏ రోగమైనా ఎలా వస్తుందో తెలుసుకుని రాకుండా జాగ్రత్తగుండాలి
రావద్దన్నా సోకిందా ఇతరులకి అంటకుండా చికిత్స చేయించుకోవాలి
పరిసరాల శుభ్రతతో పాటు ఇళ్లలోకి గాలి వెలుతురు బాగా ఉండాలి
వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారంతో వ్యాధి నిరోధకశక్తి పెంచుకోవాలి!

కఫం రక్త మూత్రపరీక్షలు ఛాతీఎక్సరేతో వైద్యుడ్ని కలవడం మానకు  
వ్యాధి సోకితే నిరాశ చెంది జీవితమే నాశనం అయ్యిందని చింతించకు
నోటి నుండి వచ్చిన కఫాన్ని కాల్చివేయకుండా బయట పారవేయకు 
క్షయ సోకితే బాహటంగా దగ్గి తుమ్మి ఉమ్మి ఇతరులకు అంటించకు!

"డాట్స్" పరిమిత కాలంలో క్షయవ్యాధి నయంకై నేరుగా చేసే చికిత్స
క్షయరోగ నిర్ధారణ జరిపి రోగి చికిత్సను పర్యవేక్షించే బాధ్యతగల వ్యవస్థ 
ఈ వ్యాధి బారిన పడకుండా పుట్టినపిల్లలకు బి.సి.జి టీకా వేయించండి
రోగ దినోత్సవం నిర్వహించాల్సిన అవసరంలేని అవగాహనకై తోడ్పడండి! 

Friday, March 8, 2019

!!నేనే ఆధారం!!

నా కళ్ళతో కాదు నీ మనసుతో చూడు కనబడతాను
కరుణ దయ రక్షణ సంరక్షణనే పేర్లతో పిలవబడతాను 
నీ జీవితంలో నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంచేది నేను
మనసుని చల్లపరచి ఉధ్రేకాన్ని నీరులా మారుస్తాను..

శ్రమతో అలసిన నరాల్లో కొత్త రక్తానినై ప్రవహిస్తాను   
చీకటిలో కొట్టుమిట్టాడు జీవితంలో వెలుగు నింపుతాను!

మనసుపెట్టి చూడు...ప్రతి మగువా ప్రతి రూపంలోనూ
తల్లి చెల్లి కుమార్తె స్నేహితురాలు భార్య ప్రియురాలే కాక
ఉపాధ్యాయురాలిగా భోధించి అవసరమైతే దండిస్తాను!!

సుచితో ప్రవహించే నీరులా పరిస్థితికనుగుణంగా మర్లుతాను
నేను లేనిది జీవితం తీరని దాహం ఇంకా అసంపూర్ణం..
ఈ సృష్టికి నేనే మూలం...సంతృప్తికర జీవనానికి ఆధారం!

Wednesday, March 6, 2019

!!ముందుచూపు!!


మెకానికల్ మనుషుల మనసు కరిగించాలని
కంకణం కట్టుకుని కాలంతో పోటీపడి కుదరక
సర్దుబాటు కాని సమయంతో రాజీకి రాలేక..
కాలాన్ని అద్దెకు తీసుకుని ఆశల్ని బ్రతికిస్తున్నా!
  
ఆధునిక కలికాలంలో అధికవేగంతో పరిగెట్టాలని 
ప్రయత్నం ఎంతో చేసి అలసినా విసుగు చెందక 
తెగిన మదిని మమతల దారంతో ముడేయలేక..    
చమురు చేబదులు అడిగి లాంతరు వెలిగిస్తున్నా!

వాడి వెలిసిపోయిన నవ్వును చిగురింపజేయాలని 
బరువు బాధ్యతల్లో మునిగిన వారిని అడుగలేక    
యంత్రాలకు బానిసైన వారిని బంధించడం రాక..
త్వరగా తీసుకెళ్ళమని ఆయువుకి అర్జీపెట్టుకున్నా!

Tuesday, January 15, 2019

అసలైన పండుగ

ఏ పండుగ చూసినా ఏముంది..అంతా ఆర్టిఫిషల్ 
పలుకరింపుగా శుభాకాంక్షలంటూ మెసేజ్ పెట్టడం
ఒక వీడియోను ఫార్వాడ్ చేసి రిలాక్స్ అనుకోవడం     
ఒక సెలవు దొరికిందని ఉద్యోగస్తులు సంతోషపడడం
మనసు ప్రశాంతతను వీడ నిద్రనే మాత్రగా మ్రింగి
కలని ఆనందమని అందరూ అలా ఉండాలని కోరగా
ఉండలేమని అంతరంగం చేసే శబ్దాన్ని నిశ్శబ్దమని 
మనుషులు నవ్వడంరాక  ఏడ్చే ప్రయత్నంలో అలసి
డిగ్నిటీ అనే లేని గంభీరత్వాన్ని అరువు తెచ్చుకుని
అసలు రూపాన్ని మరచి యంత్రంగా మారువేషం దాల్చి 
ఒకర్ని మించి మరొకరు నటనలో అవార్డ్ కొట్టేస్తుంటే..
పండుగలు పబ్బాలతో అవసరం ఏముంది అనిపిస్తుంది
కలిసి మెలిసి కల్మషం లేకుండా కష్టపడి పనిచేసినరోజు 
ఏ దినమైనా..ప్రతి ఇంటా సంక్రాంతి సంబరమౌతుంది! 

Saturday, January 5, 2019

!!ఏమి భాగ్యము!!

జనం అంటుంటారు ఆడవాళ్ళు అదృష్టవంతులని 
నిజమేనేమో...మహిళలు మహాగొప్పజాతకులు!
రాత్రంతా సగం మేల్కొని సగం నిద్రతో గురకతీస్తూ
చీకటి సిరాలో వేళ్ళుంచి పగటిపని జాబితా రాస్తూ
పిల్లల దుప్పటి సర్ది తలుపులు కిటికీలు మూస్తూ
మగని మనసు నొప్పించని చిట్కాలకై వెతికేరు...
రవి ఒళ్ళు విరుచుకోక ముందే నిద్రలో పరిగెడుతూ
గాలికంటే వేగంగా ఇంట్లోనూ బయటా తిరుగుతూ
రోజువారి ఆశల్ని పిండేసి మాసినబట్టల్లా మూలకేసి 
క్యారేజీలోకి కొత్తరుచుల కవితలు కడుతుంటారు...
తమకు తాము దూరమై ఇంట్లో వారందరికీ దగ్గరై
తీరని కలల్ని పూర్తిగా కనక పిల్లల కలల్ని తీర్చేటి
ఇల్లాలైనా ఉద్యోగినైనా నవ్వుని మేకప్ వేసుకుని
మండుటెండలో మంచుపూలజల్లు కోరుకుంటారు...
ఆనందంగా ఉండాలన్న భరోసాతోటి బ్రతికేస్తుంటారు    
ఆహా ఏమి భాగ్యము మగువా నీదెంతటి అదృష్టం!