Friday, December 14, 2012
Friday, December 7, 2012
Monday, December 3, 2012
Thursday, November 22, 2012
Sunday, November 11, 2012
పుర్రెకో ఆలోచన!
ఒక మానేజర్, వాళ్ళ అసిస్టెంట్, ఒక తల్లి, వాళ్ళ అమ్మాయి కలిసి ట్రైన్ లో ప్రయాణమై వెళుతున్నారు. ప్రయాణంలో పలకరింపులతో పరిచయాలయ్యాక పిచ్చాపాటి మాటలతో స్నేహితులయ్యారు.
కొద్దిసేపటికి ఒక పెద్ద టన్నల్ వచ్చి దానిగుండా ట్రైన్ వెళ్ళడంవలన బోగీలో చీకటి వ్యాపించింది. అంతలో అకస్మాత్తుగా ఎవరినో ముద్దాడిన మరియు వెంటనే చెంపగుయ్యిమన్న శబ్ధం వినిపించాయి. మరి కొద్ది క్షణాలకి టన్నల్ నుండి టైన్ వెలుగులోకి వచ్చింది.
ఆ పెద్దావిడ, అసిస్టెంట్ ఎదురెదురుగా కూర్చుని ఒకరి ముఖం వంక మరొకరు అయోమయంగా చూసుకుంటుంటే, మానేజర్ ఎర్రగా కమిలిన ముఖాన్ని రుద్దుకుంటూ కూర్చున్నాడు.
ఎవరికి వారే ఒకరితో ఒకరు ఏమీ చెప్పుకోకుండానే ఒకరి గురించి ఒకరు ఇలా అనుకుంటున్నారు.
పెద్దావిడ:- మానేజర్ ఏదో చెడుబుధ్ధితో మా అమ్మాయిని ముద్దాడబోతే భలే బుద్ది చెప్పిందిలే వెధవకి అనుకుంది.
అమ్మాయి:- బహుశా మానేజర్ నన్ననుకుని మా అమ్మని ముద్దాడి చెంపదెబ్బ తిన్నాడు అనుకుంది.
మానేజర్:-ఛా!....ఛా! ఈ అసిస్టెంట్ కి బుద్ధిలేదు, ఆ అమ్మాయిని వీడు ముద్దు పెట్టుకుంటే నేనే ఆ పని చేసాననుకుని నన్ను చెంపదెబ్బ వేసింది అనుకున్నాడు.
అసిస్టెంట్:- ఈ సారి ఇంకో టన్నల్ వచ్చినప్పుడు మరలా ముద్దాడినట్లు శబ్ధం చేసి మా మానేజర్ ని ఇంకాస్త గట్టిగా చెంపదెబ్బ వేయాలి. రాస్కెల్....అఫీసులో కాల్చుకు తింటున్నాడు అనుకున్నాడు:-)

Sunday, November 4, 2012
బాడ్ లక్/గుడ్ లక్?
మేము కొత్తకారు కొన్న మర్నాడే ఆ బ్రాండ్ కార్ల రేటు 30వేలు తగ్గేసరికి చుట్టు పక్కలవాళ్ళంతా అయ్యో ఎంత “బాడ్ లక్” అంటూ జాలిచూపిస్తూ మనసులో మాత్రం భలే భలే అనుకుని మా కారుని చూసి కాస్త ఈర్ష్య పడ్డారు. నేను మాత్రం….”బాడ్ లక్? “గుడ్ లక్?
ఎంటో చూడాలి అనుకున్నా.
కొన్న నెలలోనే అతితక్కువ ధర్లో ఇల్లొకటి కారుచౌకగా వస్తే కొన్నాము…..ఇది విని బంధువులంతా, భలే చౌక బేరము కారొచ్చిన వేళ మీకు కల్సొచ్చింది ఎంత “గుడ్ లక్” కదా అని పైకి అన్నా ఎక్కడిదో ఇంత డబ్బు అని మనసులో అనుకుని కాస్త అసూయ పడ్డారు. నేను మాత్రం “గుడ్ లక్? “బాడ్ లక్? చూద్దాంలే అనుకున్నా.
ఇంకో పదిరోజులకి మా కుటుంబమంతా కలసి కార్లో ఊరు వెళితే యాక్సిడెంట్ అయ్యి నా కాలు విరిగింది….అందరూ ఛా! శనివారం ఇనపవస్తువు అందులోను ఈ కారు అచ్చిరాలేదు అందుకే ఇలా అయ్యిందంటూ మాకిది “బాడ్ లక్! ఆని పాపం ఆ నోరులేని కారుని ఆడిపోసుకున్నారు. నేను మాత్రం కిమ్మనకుండా కాలికి కట్టువేసుకుని కూర్చున్నా.
మరో ఆరువారాలకి నా కాలు పూర్తిగా నయమయ్యాక, మా ఫ్రెండ్స్ అందరూ కలవకుర్తిలో ఒక ఫంక్షన్ లో కలుసుకుని అక్కడి నుండి అందరం ఒక సుమో మాట్లాడుకుని హంపీ విజయనగరం వెళ్ళాలనుకున్నాము. ఎప్పుడూ తన విధిని సక్రమంగా నిర్వర్తించే మాకారు ఆరోజు సిటీ దాటి బయటికి అడుగిడనంటూ మొరాయించి అవుటర్ రింగ్ రోడ్లోనే ఆగిపోయింది....….చేసేదేం లేక అప్పటికే ఆరు గంటలు ఆలస్యమైందని నేను ప్రయాణం ఆపుకుంటే, వాళ్ళంతా ఫంక్షన్ లో కలిసి అక్కడినుండి హంపీకి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన సుమో లారీకి గుద్దుకుని ఒకరు చనిపోగా, నలుగురికి తీవ్రగాయాలై బయటపడ్డారు.
“బాడ్ లక్? లేక “గుడ్ లక్? అని ఎవరిని అడగాలో తెలియక మౌనంగా ఉన్నా….

Thursday, November 1, 2012
Wednesday, October 24, 2012
Saturday, October 6, 2012
నీవెలా?
ఏంటో ఈ జీవితంలో ఏది సాధించాలన్నా కష్టతరంగా మారిపోయిందంటూ వంటింట్లో సహాయం చేస్తూ నా కూతురంది. కూరగాయలుకోస్తూ నేను మూడుగిన్నెల్లో నీళ్ళుపోసి ఒక గిన్నెలో క్యారెట్, రెండవగిన్నెలో కోడిగుడ్డు, మూడవదాంట్లో కొన్ని కాఫీగింజల్ని వేసి మరిగించమన్నాను. ఒకటిది, రెండవది పర్వాలేదు కానీ కాఫీగింజల్ని కూడా మరిగించమన్నది అంటే ఏదో మత్లబుందని మనసులో అనుకుని పైకి మాట్లాడకుండా పావుగంట తరువాత వాటిని వేర్వేరు గిన్నెల్లోకి మార్చి వీటి మర్మమేమిటో చెప్పు మాతాజీ అన్నట్లు నావైపు చూసింది....
1.ముందు గట్టిగా ఉండి వేడి తగలగానే తన అస్తిత్వాన్ని కోల్పోయి మెత్తగామారి పనికి రాకుండా పోయిన క్యారట్,
2.పైనపెంకు లోపల ఏదో సాధించాలన్న జిజ్ఞాసలాంటి సొనని కొంతకాలం కాపాడినా వేడి అనే ఒడిదుడుకులని తట్టుకోలేక పై డొప్ప పగిలి లోపల గట్టిపడిన గుడ్డు,
3.మరిగిన నీటిలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా చెక్కు చెదరక నీటికి తన రంగుని, రుచిని మరియు గుణాన్ని ఇచ్చిన కాఫీగింజలు......
మూడూ సమానంగా ఒకే రకమైన విధి ప్రతికూల పరిస్థితులవంటి నీటిలో మరిగినా దేనికదే వేరువేరుగా పరివర్తనం చెందాయి.....
మరి నీవు ఎలా మారాలి అనుకుంటున్నావో చెప్పు?
క్యారట్?
కోడిగుడ్డు?
కాఫీగింజ?

Wednesday, September 19, 2012
Sunday, September 16, 2012
విజయానికై....
ఆఫీస్ లో ఏపని మొదలెట్టినా నా ఫ్రెండ్స్ అంతా అలా రిస్క్ తీసుకుని చేయడమెందుకు నలుగురితోపాటు మనం కూడా గుంపులో గోవిందం అంతేకానీ ఇలా ఓవర్ గా వర్క్ చేసి నీవు సాధించే మెడల్స్ ఏమున్నాయంటున్నారు, లైఫ్ బోర్ గా రొటీన్ గా ఉంది ఏదైనా గొప్ప సక్సెస్ సాధించాలంటే ఏంచేయాలని అడిగిన మా అమ్మాయికి చెప్పిన విషయం మీతో పంచుకుంటూ......
ఒక అనాధాశ్రమంలోని పిల్లలకు ఆటల పోటీల్లో రొటీన్ కి భిన్నంగా ఒక క్రొత్తరకమైన పోటీని పెట్టారు అందులో వివిధ రకాలైన కూరగాయల్ని పండ్లని ఒకే ఆకారంలో కట్ చేసి వారి కళ్ళకిగంతలు కట్టి, చుట్టూ మిగిలిన పిల్లల కేరింతల మధ్య కనుగొనమని చెప్పారు. అయిదు నిముషాల వ్యవధిలో ఎవరెక్కువగా కనుక్కుంటే వారే విజేతలు. పోటీ మొదలు పెట్టగానే పిల్లలందరూ వారికి తోచిన విధంగా అరుస్తూ అది ఇదని, ఇది అదనీ అరుస్తుంటే పాల్గొన్నవారు కంగారులో చాలా తప్పులు చెప్పారు. కానీ ఒక చిన్నారి మాత్రం ప్రతి ముక్కని రుచి చూసి వాసనతో పసిగట్టి అత్యధిక కూరగాయల, పండ్ల పేర్లను చెప్పి ప్రధమ బహుమతిని కైవసం చేసుకుంది. ఆ చిన్నారిని చూస్తే ముద్దేసి నీ పేరేంటని అడిగితే పక్కనున్న ఇంకో అమ్మాయి మేడం! ఈ అమ్మాయికి ఆక్సిడెంట్ అయి వినపడంలేదు అందుకనే మేము ఏం చెప్పినా వినకుండా తన సొంత ఆలోచనతో, తెలివితో ప్రైజ్ కొట్టేసిందని అమాయకంగా చెప్పి నా కళ్ళు తెరిపించింది.
ఇది మా అమ్మాయికి అర్థమై ఉంటే త్వరలో ఒక మంచి సక్సెస్ న్యూస్ తో మీ ముందుంటాను.

Sunday, September 2, 2012
నమ్మకం
జ్ఞానం, ధనం, శక్తి, శ్రమ మరియు నమ్మకం అందరూ మంచిమిత్రులు.....
కలిసి ఆనందంగా ఉందామనుకున్నారు కానీ కాలం కలసిరాక విడిపోవలసి వచ్చింది....
ఎవరు ఎక్కడికి వెళ్ళి ఉండాలో అని చర్చించుకుంటూ.....
జ్ఞానం:- నేను విద్యాలయాల్లో, మందిరాల్లో, మసీదు, చర్చి, గురుద్వార్ లాంటి చోట్ల తలదాచుకుని నా దరిచేరిన వారికి నేను తగిన విధంగా దక్కుతానంది.
ధనం:- నేను మహల్లో, ఆస్తిపరుల ఖజానాల్లో దాకుంటానని చెప్పింది.
శక్తి:-ఆరోగ్యం మరియు సమతుల్యమైన ఆహారాన్ని నేను ఆశ్రయిస్తానన్నది.
శ్రమ:- సోమరితనంవీడి పట్టుదలతో సాధించాలని అనుకునే వారి దగ్గర వారాలు గడిపేస్తూ బ్రతుకుతానన్నది.
నమ్మకం మాత్రం మౌనంగా శూన్యంలోకి చూస్తుంటే జ్ఞానం మరియు ధనం అదేం నీవు ఎక్కడికి వెళతావో చెప్పవేం అనడిగిన దానికి ఒక ధీర్ఘశ్వాస తీసుకుని నిదానంగా ఇలా అన్నది........ "నేను ఒక్కసారి వెళ్ళిపోయానంటే ఇంక తిరిగిరాను".

Monday, August 20, 2012
Friday, August 10, 2012
పెదచేప-చినచేప
జఫాన్ వాళ్ళకి తాజా చేపలంటే చాలా ఇష్టం.
కానీ వారికి దగ్గరలో నీటివనరులు లేకపోవడంతో చేపలుపట్టి ఐస్ లో నిలువ చేసుకునేవారంట. కానీ దానివల్ల చేపల్లో తాజాదనం నశించి అవి తక్కువ ధరకి అమ్ముడుపోయి వ్యాపారస్తులకి నష్టం వాటిల్లుతున్నదని పెద్ద ట్యాంకుల్లో చేపల్ని పట్టి వాటిని అందులో పెంచసాగారు. అయినా అవి కొన్నిరోజులకే నిస్సత్తువగా మారి అక్కడక్కడే తిరుగుతూ ముందు ఉన్న రుచి తగ్గిందని గమనించి ఆ పెద్ద పెద్ద ట్యాంకుల్లో ఆ చేపలతో పాటు ఒక షార్క్ చేపని కూడా వేయడంతో చేపలన్నీ ప్రాణభయంతో ట్యాంకతా కలియ తిరుగుతూ చలాకీగా ఉండేసరికి జఫాన్ వాసులకి తాజా రుచికరమైన చేపల్ని ఆరగించే అవకాశం వారిసొంతమైంది.
గమనించారా.....
మనంకూడా కొన్నిసార్లు అలా నిస్సత్తువతో, నిస్తేజంగా జీవిస్తుంటాం. అలాకాకుండా జీవితంలోని ఒడిదుడుకులకు నిరాశపడక సవాలు అనే షార్క్ చేపల్ని మన మైండ్ అనే ట్యాంకులోకి వదిలితే మనం కూడా చాకచక్యంతో నైపుణ్యంగా కష్టాలని ఎదిరించి ముందుకుసాగిపోతాం.
ముందుకు సాగిపోయి ఏం లాభం ఎవరికో ఒకరికి ఆ చేపల్లా బలికావలసిందేకదా అని అనుకునేవారికి....ఎప్పుడో ఒకప్పుడు అంతమైయ్యేదే కదా అలా కనీసం పరులకోసం పనికొచ్చేలా (రుచికరమైన ఆహారంలా) పోతే పరమార్థం కదా అంటాను.
మీరు ఏమనితిట్టుకున్నాసరే!!!

Thursday, August 2, 2012
రక్షించేబంధమా?
హాయ్ ఫ్రెండ్స్! "రక్షాబంధనం" అంటే రక్షణ కోరుతూ ఒక బంధాన్ని ఇరువ్యక్తుల మధ్య సృష్టించుకోవడం అని ఒక ప్రముఖవ్యక్తి చెప్పగా విని నాలో కలిగిన భావాలని మీతో పంచుకోవాలని నా ఈ చిన్ని ప్రయత్నం.
ఒకవేళ పైన చెప్పినట్లు ఇరువ్యక్తుల నడుమ ఆ బంధమే రక్షించేదైతే అది అన్నాచెల్లెళ్ళ మధ్యనే ఎందుకో అక్కాచెల్లెళ్ళు, అన్నాతమ్ముళ్ళు, మేనకోడలుమామలు, బావామరదళ్ళు ఇలా ఒకరికొకరు ఎవరు రక్షిస్తారు అనుకుంటే వాళ్ళకే ఈ "రాఖీ" కట్టొచ్చుకదా!
పోనీ లింగ భేధముంటేనే రక్షిస్తారు అది కూడా మగవారు ఆడవారినే కాపాడతారు అనుకుంటే ఆఫీసులో ఉన్న బాస్ కి రాఖీ కడతామంటే చాలామంది బాస్ లు ఎందుకు వద్దంటారో!

నా ఈ మట్టిబుర్రకి తోచిన చెత్త ఆలోచనలని తోసిపారేయకుండా, ఆలోచించి బదులిస్తారని ఆశిస్తూ...
ఏమైనా ఒక బంధం రక్షిస్తుంది అనుకుంటే ఆ బంధానికి నేను బద్ధురాలిని....అందుకే అందరికీ "రక్షాబంధనం" శుభాకాంక్షలు తెలియజేస్తున్నా!!!
Sunday, July 29, 2012
మట్టిబెడ్డలు
సంధ్యా సమయంలో ఒకవ్యక్తి అలా సముద్రపు ఒడ్డున నడుస్తూ కుప్పగా పడి దారికడ్డుగా ఉన్న పెద్ద పెద్ద మట్టిబెడ్డల్ని చూసి వాటిని తీసి ఒకోటి సముద్రంలోకి విసిరేస్తూ చివరికి నాలుగు మిగిలి ఉండగా....యాధాలాపంగా ఒక మట్టిబెడ్డని పగులగొట్టి చూసి ఆశ్చర్యంతో చకితుడైనాడు అందులో మెరుస్తున్న వజ్రాన్ని చూసి. మిగిలిన నాలుగూ పగులగొట్టి చూడగా అందులో కూడా వజ్రాలే మెరుస్తూ కనపడి ఇతడ్ని వెక్కిరిస్తున్నట్లుగా అనిపించి....
అయ్యో అనవసరంగా మట్టిబెడ్డలు అనుకుని పైపైన చూసి అనవసరంగా వజ్రాలని సముద్రపాలు చేసాను కదా అని పశ్చాతాపడ్డాడు....

మనం కూడా అలాగే పైపై ఆకారాన్ని చూసి ఎందుకూ పనికిరారనుకుని నిర్లక్ష్యం చేస్తుంటాం వజ్రాలాంటి కొంతమంది వ్యక్తుల్ని. అలా కాకుండా చూసిన వెంటనే ఎవరిపైనా ఒక నిర్ధిష్టమైన అభిప్రాయానికి రాకుండా వారితో సాన్నిత్యంగా మెలిగి వారిలోని మంచిని గ్రహిస్తే వజ్రాలెన్నో మన చేయిజారిపోకుండా మనతోనే ఉండి మన విలువను మరింత పెంచుతాయేమో యోచిద్దాం.....ఏమంటారు!
Sunday, June 24, 2012
3 ప్రశ్నలు???
మా ఆఫీస్ లో నా సహ ఉద్యోగిని లంచ్లో ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలంటూ ఆత్రుతతో భోజనం కూడా చేయనీయకుండా వినమంటూ వివరించబోతుంటే......
ఒక్క నిముషం నీవు చెప్పే ముందు నేను నిన్ను మూడు ప్రశ్నలు అడుగుతాను వాటికి సమాధనం చెప్పి తరువాత నీవు చెప్పమంటే.... సరే అన్న తనతో సాగిన సంభాషణ...
జ:- "లేదు"విన్నాను చెప్పుకుంటుంటే...ఒక్క నిముషం నీవు చెప్పే ముందు నేను నిన్ను మూడు ప్రశ్నలు అడుగుతాను వాటికి సమాధనం చెప్పి తరువాత నీవు చెప్పమంటే.... సరే అన్న తనతో సాగిన సంభాషణ...
మరి అలాంటప్పుడు నీవు చెప్పేది నిజము అవునో కాదో, నీవు కన్నులతో చూడలేదు నీవు చెప్పబోయే విషయం గురించి నీకే సరిగ్గా తెలీదు దాని గురించి మనకెందుకు!
2.ప్ర:- నీవు చెప్పబోతున్న విషం మంచిదా?
జ:-"లేదు"
మంచి విషయం ఐతే పదిమందికి చెప్పు, లేకపోతే దానిగురించి మరచిపో!
3.ప్ర:-నీవు చెప్పడం వలన మనిద్దరిలో ఎవరికైనా ఉపయోగము ఉందా?
జ:-అలాంటిది ఏమీ లేదు.
నీవు చెప్పాలనుకుంటున్న విషయంలో నిజంలేదు, మంచిలేదు, ఉపయోగం అంతకన్నాలేదు.
అలాంటప్పుడు అది నాకు చెప్పవలసిన అవసరం కూడాలేదు.
ఫ్రెండ్స్....ఏదైనా విషయం చెప్పేముందు ఈ మూడు ప్రశ్నలు మనకి మనం వేసుకుని ముందుకు సాగుదాం...
Wishing you GOOD LUCK!
Sunday, June 17, 2012
కేక్ కిక్...
అమ్మా...ఎందుకని ఇలా అన్నీ నాకే జరుగుతున్నాయి, నేనేం తప్పుచేసాను, మొన్న లెక్కల్లో ఫెయిల్ అయ్యాను, నిన్న నా అనుకున్న స్నేహితుడు నన్ను వదిలేసాడు, ఏది అనుకున్నా నాకే ఎందుకని ఇలా వ్యతిరేకంగా జరుగుతుంది? ఇలా ప్రశ్నలవర్షం కురిపిస్తున్న కూతుర్ని కేక్ తయారుచేస్తున్న తల్లి చూసి నీకు ఇష్టమైన కేక్ చేస్తున్నాను ఇది నీవు తిన్నాక నీ ప్రశ్నలకి సమాధానం వెదుకుదాం అన్న మాటలకి సరె అని..."నీవు చేసే కేక్ అంటే నాకు అమితమైన ఇష్టం".
అమ్మ: కాస్త డాల్డాని అందివ్వు..
కూతురు: ఛా ఇదేంటో ఇంత జిడ్డుగా ఉంది!
అమ్మ: ఆ 4 కోడిగుడ్లని కూడా పగులగొట్టి అందులో వేయి, అలాగే ఆ మైదాపిండిని కూడా, అదే చేత్తో చిటికెడు సోడా తీసుకుని కలుపు..
కూతురు: యాక్ :( ఇదేంటమ్మా ఈ గుడ్లు ఇంత వాసన వస్తున్నాయి, ఈ పిండి ఇలా రబ్బర్ లా సాగుతుంది....చూస్తుంటేనే అసహ్యంగా ఉన్నాయి!
అమ్మ: అవును అవి అన్నీ అలా విడివిడిగా అలాగే ఉంటాయి, కానీ వాటినన్నింటినీ సమపాళ్ళలో కలిపి సక్రమంగా ఉడకనిస్తే....నీకు ఇష్టమైన రుచికరమైన కేక్ తయారౌతుంది.
అలాగే మన పనులు కూడా......ఇష్టమైన విధంగా జరగాలంటే విసుగు, చిరాకు లేకుండా మనకి జరుగుతున్న విషయాలని కష్టం అనుకోకుండా సక్రమంగా ఆలోచించి ఆచరణలో పెట్టి శ్రమపడితే తగిన సమయానికి మనం ఆశించిన ఫలితాలు మనకి దక్కుతాయి. అవే మనం జీవితంలో ముందుకు సాగడానికి కిక్కునిస్తాయి :)

Subscribe to:
Posts (Atom)